దమ్ముంటే కల్తీ మద్యంపై చర్చకు రావాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:37 PM
Discussion on adulterated alcohol ‘వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీమద్యం విక్ర యించి వేలాది మంది ప్రాణాలు తీశారు. కమీషన్ల పేరిట రూ.3,500 కోట్లు దోచు కున్నారు. మాజీ సీఎం జగన్‌కు దమ్ముంటే కల్తీ మద్యంపై బహిరంగ చర్చకు రావాల’ని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాల్ విసిరారు.
పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాల్
అరసవల్లి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ పాలనలో రాష్ట్రంలో కల్తీమద్యం విక్ర యించి వేలాది మంది ప్రాణాలు తీశారు. కమీషన్ల పేరిట రూ.3,500 కోట్లు దోచు కున్నారు. మాజీ సీఎం జగన్‌కు దమ్ముంటే కల్తీ మద్యంపై బహిరంగ చర్చకు రావాల’ని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాల్ విసిరారు. స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కూట మి ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బురద జల్లే ప్రయత్నం చేస్తూ ప్రజల ముందు మరింత చులకన అవుతున్నారు. నేరగాళ్లను ప్రోత్స హించడం నీకు వెన్నతో పెట్టిన విద్య. నిజా నికి నకిలీ మద్యానికి మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్న సంగతి అందరికీ తెలు సు. అందుకే నీవు కల్తీ మద్యంలో సహక రించిన ప్రతాప్‌రెడ్డి, గోవర్దనరెడ్డి వంటి వారికి గతంలో ఎమ్మెల్యే, మంత్రి పదవులి చ్చావు. కానీ మా అధినేత, సీఎం చంద్ర బాబు కల్లీమద్యంపై ఉక్కుపాదం మోపారు. ఆరోపణలు వచ్చిన వెంటనే మా పార్టీలోని వ్యక్తులను కూడా వెంటనే సస్పెండ్ చేశారు. గతంలో కల్తీ మద్యంతో మరణించిన వారి కుటుంబాలను కనీసం ఏనాడైనా పరామర్శిం చావా?. కర్ణాటక, తమిళనాడుల్లో మీ కల్తీ మద్యాన్ని నిషేధించారు. అప్పుడైనా దానిపై వివరణ ఇచ్చావా?. నీవు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో సరఫరా అవు తున్న మద్యంలో ప్రమాదకర విష రసాయ నాలు ఉన్నాయని అమెరికాలోని ఓ ల్యాబ్ కూడా ధ్రువీకరించింది. అటువంటి నీకు సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేసే హక్కు లేదు. ఇలా అబద్దాలతో ప్రజలను ఎంతకాలం మోసం చేయగలవు. సర్పంచ్ కన్నా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నా వ’ని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పీఎంజే బాబు, సింతు సుధాకర్, ప్రఽధాన విజయరాం పాల్గొన్నారు.