ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:51 PM
ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు.
జి.సిగడాం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. వాండ్రంగి కూడలి ముఖద్వారం వద్ద ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన గోమాత విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. గోమాతను దర్శించుకుంటే వెయ్యి ఆలయాలు దర్శించు కున్నంత పుణ్యం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు హోమం, ప్రత్యే పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కుదిరెళ్ల బుజ్జి, పీఏసీఎస్ చైర్మన్ బెవర జగన్నాథరావు, నేతలు బాలబొమ్మ వేంకటేశ్వరరావు, కంచరాన సూరన్నాయుడు, ఎండమూరి శ్రీనివాసరావు, వీవీ గోపాలరావు పాత్రో, పలువురు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.