Share News

Swachha srikakulam: స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు నిబద్ధతతో పనిచేయాలి

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:24 PM

Make cleanliness a part of your lifestyle స్వచ్ఛ శ్రీకాకుళం, స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛతను జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని కోరారు.

Swachha srikakulam: స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు నిబద్ధతతో పనిచేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ శ్రీకాకుళం, స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. ప్రజలందరూ స్వచ్ఛతను జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని కోరారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఈవోపీఆర్డీలు, పంచాయితీ కార్యదర్శులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ‘ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ దివస్‌’ బాధ్యతగా నిర్వర్తించాలి. ఒకరోజు కార్యక్రమంతో సరిపెట్టకుండా, ప్రతీరోజు ప్రజల సహకారంతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఇంటింటి చెత్త సేకరణలో నిర్లక్ష్యం వద్దు. ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ప్రజల నుంచి సానుకూల స్పందన రావాలి. కొన్ని గ్రామాల్లో పరిశుభ్రతపై వ్యతిరేకత కనిపిస్తోంది. పారిశుధ్య కార్మికుల హాజరు, పనుల ప్రణాళిక, మోనటరింగ్‌ వంటి అంశాలపై అధికారులు కచ్చితంగా పర్యవేక్షించాలి. విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం, మంచినీరు, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత వంటి అంశాలను సమగ్రంగా పరిగణించాలి. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రతీ అధికారి బాధ్యత తీసుకోవాల’ని తెలిపారు. సమావేశంలో డీపీవో భారతీ సౌజన్య, డీఎల్‌పీవో రమణ, టెక్కలి డీఎల్‌పీవో గోపీబాల, పంచాయితీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:24 PM