లక్ష్య సాధనకు కృషిచేయాలి: ఏపీసీ
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:03 AM
లక్ష్య సాధనకు కృషి చేయాలని సర్వశిక్షా అభియాన్ ఏపీసీ శశిభూషణ్ తెలిపారు. గురువా రం వమరవల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థలో జిల్లా స్థాయి కళా ఉత్స వ్ పోటీలు నిర్వహించారు. తొలి రోజు నిర్వహించిన పాటలు, నృత్యం, వాయిద్య సంగీత పోటీలకు జిల్లాలోని 40 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
గార /రూరల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): లక్ష్య సాధనకు కృషి చేయాలని సర్వశిక్షా అభియాన్ ఏపీసీ శశిభూషణ్ తెలిపారు. గురువా రం వమరవల్లిలోని జిల్లా విద్యాశిక్షణ సంస్థలో జిల్లా స్థాయి కళా ఉత్స వ్ పోటీలు నిర్వహించారు. తొలి రోజు నిర్వహించిన పాటలు, నృత్యం, వాయిద్య సంగీత పోటీలకు జిల్లాలోని 40 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.గాత్ర సంగీతం విభాగానికి వంజరాం జడ్పీఉన్నత పాఠశాల విద్యార్థి ఆర్.వెంకటేష్, వాయిద్య సంగీతం విభా గానికి ముత్యాలపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని సీహెచ్ వర్షిణి, గ్రూపుసాంగ్ విభాగంలో టెక్కలి మహాత్మ జ్యోతిభా పూలే పాఠశాలకు ప్రథమ బహుమతి, శ్రీకాకుళంలోని న్యూసెంట్రల్ స్కూల్‌కు ద్వితీయ బహుమతిని గెలుచుకోగా ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్రావు ప్రశంసాపత్రాలను అందజేశారు.విజేతలు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొం టారని నోడల్ అధికారి తాడేల వెంకటరావు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో వినోదిని, అసిస్టెంట్ నోడల్ అధికారి చలపాక రమణ, ఆచార్యులు గోవిందరావు పాల్గొన్నారు.