గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:29 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ ఐక్యంగా ఉండి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.
జి.సిగడాం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ ఐక్యంగా ఉండి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తద్వారా పార్టీ విజయానికి సహకరించేలా అవ గాహన కలిగించాలన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి చెం దిన రాష్ట్రాల్లో నిలిపేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అభివృద్ధికి మారుపేరు టీడీపీ అని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసు కుని వాటి పరిష్కారానికి పాటుపడాలన్నారు. బజారువీధిలో పిన్నింటి భాస్క రరావు సొంత నిధులతో ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతు లను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్, ప్రధాన కార్యదర్శి కుదిరెళ్ల బుజ్జి, పీఏసీఎస్ అధ్యక్షుడు బెవర జగన్నా ఽథరావు, రైల్వే జోనల్ బోర్డు సభ్యుడు బాలబొమ్మ వెంకటేశ్వర రావు, నాయకులు టంకాలమౌళీశ్వరరావు, మజ్జి కన్నంనాయుడు, కంచ రాన సూరన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.