మహిళలపై హింసను నిర్మూలించేలా పోరాడాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:39 PM
సమాజంలో రోజురోజుకి మహిళ లపై పెరుగుతున్న హింసను నిర్మూలించే దిశగా అందరూ కలిసి పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం లీగల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సమాజంలో రోజురోజుకి మహిళ లపై పెరుగుతున్న హింసను నిర్మూలించే దిశగా అందరూ కలిసి పోరాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరి బాబు అన్నారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్‌వో కార్యాల యంలో మహిళలు హింసను ఎదుర్కోవడంలో చట్టపరమైన అంశాలపై అవగాహన కలిగించారు. జిల్లాన్యాయ సేవాధికార సంస్థ మహిళ లకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందన్నారు. అవసరమైతే మహిళలకు ఉచి తంగా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. మహిళలు చట్టాలపై అవగా హన పెంచుకొని తమకు తాము రక్షణ కల్పించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎం హెచ్‌వో డా.కె.అనిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ డి.విమల తదితరులు పాల్గొన్నారు.
గర్భిణుల పేర్లు నమోదు తప్పనిసరి
అరసవల్లి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గర్భిణుల పేర్లు తప్పనిసరిగా నమోదు చేసు కోవాలని డీఎం హెచ్‌వో డా.కె.అనిత అన్నారు. మంగళవారం డీఎం హెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో ఇచ్ఛాపురం, సారవ కోట, ఎల్‌ఎన్.పేట మండలాల ఏఎన్‌ఎంలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలతో గర్భిణుల సంరక్షణ, సురక్షిత ప్రసవాలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భి ణుల పేర్లను మొదటి మూడు నెలల్లోగా నమోదు చేయాలని, పరీక్షలు నిర్వహించి తగు సూచనలు, సలహా లివ్వాలన్నారు. ఒకవేళ అబార్షన్ అయితే ఆర్సీహెచ్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ మూడు మండ లాల్లో లింగ నిష్పత్తిలో వ్యత్యాసాలపై కారణాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఐ.విమల, డిప్యూ టీ డీఎంహెచ్‌వో మేరీ క్యాథరిన్, డీఐవో డా.రాందాసు, ఐసీడీఎస్ నోడల్ అధికారి పి.మణెమ్మ, డిప్యూటీ డెమో కె.ఎర్రన్న, వైద్యాధికారులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.