స్థానిక ఎన్నికల విజయానికి తోడ్పడాలి
ABN , Publish Date - May 06 , 2025 | 12:05 AM
:పార్టీని బూత్‌స్థాయినుంచి మరింత బలోపేతం చేసే బాధ్యత ప్రతికార్యకర్త, నాయకుడు తీసుకోవాలని ఆమ దాలవలస నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చంద్రశేఖర్ కోరారు.
పొందూరు, మే 5 (ఆంధ్రజ్యోతి):పార్టీని బూత్‌స్థాయినుంచి మరింత బలోపేతం చేసే బాధ్యత ప్రతికార్యకర్త, నాయకుడు తీసుకోవాలని ఆమ దాలవలస నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడు చంద్రశేఖర్ కోరారు. సోమవారం పొందూరులో టీడీపీనాయకులతో చర్చించారు.ఈసంద ర్భంగా పలువురునాయకులు పార్టీ, ప్రభుత్వపరంగాఉన్న సమస్యలను పరిశీలకులు దృష్టికి తీసుకువెళ్లారు.ఐకంగా త్వరలో జరిగే స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు తోడ్పడాలని సూచించారు. కార్యక్ర మంలో టీడీపీ మం డలాధ్యక్షులు సీహెచ్ రామ్మోహన్, నాయకులు కూన సత్యనారాయణ, బలగ శంకరభాస్కర్, సీపాన శ్రీరంగనాయకులు, బాడాన గిరి, వరదరాజులు, భాస్కరరావు, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.