ధరలు తగ్గించేందుకు ముందుకురావాలి
ABN , Publish Date - Sep 27 , 2025 | 11:58 PM
ధరలు తగ్గించేందుకు వ్యాపారులు స్వచ్ఛం దంగా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ధరలు తగ్గించేందుకు వ్యాపారులు స్వచ్ఛం దంగా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జీఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారులకు శనివారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. నిత్యావసర వస్తువులు, ఎలకా్ట్రనిక్స్, మెడికల్, ఆటో మొబైల్స్, వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, ఎంఎస్ ఎంఈలు, ప్యాకింగ్ మెటీరియల్, హెల్త్ ఇన్స్యూరెన్స్ తది తర వస్తువుల ధరలు తగ్గడం వల్ల రూ.8 వేల కోట్లు ప్రజలకు మిగులుతాయన్నారు.ఽ దుకాణాల వద్ద పాత, కొత్త ధరలతో బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. సచి వాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపుపై చైతన్యం చేస్తారన్నా రు. ఈ సందర్భంగా వ్యాపారుల సందే హాలను ఆమె నివృత్తి చేశారు. సమా వేశంలో అసిస్టెంట్ జీఎస్టీ అధికారి చంద్రకళ, బంగారం, రైస్ మిల్లర్లు, హోటళ్లు, కిరాణా, ఆటో మొబైల్, సిమెం ట్, ఇంజనీరింగ్ తదితర వ్యాపార సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.