Share News

హామీలను అమలుచేస్తున్నాం

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:26 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని టీడీపీ ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

హామీలను అమలుచేస్తున్నాం
మెళియాపుట్టి: పడ్డ గ్రామంలో ప్రచారం చేస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

మెళియాపుట్టి, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని టీడీపీ ఉత్తరాంధ్ర జోనల్‌ ఇన్‌చార్జి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పడ్డ గ్రామంలో సూపరిపాలన తోలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు సలాన మోహనరావు, టీడీపీ నాయకులు వెంకట్రావు అనపాన రాజశేఖరెడ్డి పాల్గొన్నారు. అలాగే కొలిగాం పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకట రమణ మూర్తి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ హయాంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కార్యక్రమంలో భాస్కర్‌గౌడో, పైల లచ్చ నయ్య, పండా, భాస్కరరావు, తేజరావు, విష్టపండా, ప్రసాద్‌పండా పాల్గొన్నారు.

ప్రజల రుణం తీర్చుకోవడమే లక్ష్యం: శంకర్‌

అరసవల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి: తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడమే జీవిత లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో భాగంగా రూరల్‌ మండ లం కుందువాని పేటలో ప్రతీ ఇంటికీ వెళ్లి ఏడాది కూటమి పాల నలో చేసిన అభివృద్ధి పనులు, పథకాలను వివరించారు. అనంతరం హుద్‌ హుద్‌ తుఫాను బాధిత కుటుంబాలకు మంజూరైన 96 ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:26 PM