ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నాం..
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:12 AM
ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు.

మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటీ నెరవేరుస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అ న్నారు. శనివారం చిన్నబమ్మిడి గ్రామంలో ‘సుపరి పాల నలో తొలిఅడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథ కాల కరపత్రాలను అందించి ప్రజలకు వివరిం చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్, నేతలు తర్ర రా మకృష్ణ, పూజారి శైలజ, వెలమల కామేశ్వర రావు, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.