Share News

నీరందక.. మంటలు ఆర్పలేక

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:37 PM

కొత్తూరులోని బత్తిలి రహదారిలో గల కమలహార్డ్‌వేర్‌ అండ్‌ ప్లేఉడ్‌ షాపులో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగి కాలి బూడిదయ్యింది.ఈప్రమాదంలో సుమారు రూ.70లక్షలు ఆస్తి నష్టంజరిగిందని షాపుయజమాని వజ్రం తెలియజేశారని పాలకొండ అగ్ని మాపక కేంద్రం అధికారి జామివిశ్వేశ్వరరావు తెలిపారు.

 నీరందక.. మంటలు ఆర్పలేక
కొత్తూరులో దగ్ధమవుతున్న హార్డ్‌వేర్‌ దుకాణం:

కొత్తూరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి):కొత్తూరులోని బత్తిలి రహదారిలో గల కమలహార్డ్‌వేర్‌ అండ్‌ ప్లేఉడ్‌ షాపులో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగి కాలి బూడిదయ్యింది.ఈప్రమాదంలో సుమారు రూ.70లక్షలు ఆస్తి నష్టంజరిగిందని షాపుయజమాని వజ్రం తెలియజేశారని పాలకొండ అగ్ని మాపక కేంద్రం అధికారి జామివిశ్వేశ్వరరావు తెలిపారు. నీరు అందుబాటు లో లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసు కురాలేకపోయారు.స్థానికులు, అగ్నిమాపకఅధికారుల కథనం మేరకు.. షాపు యజమాని ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు మూసివేసి నవరా త్రుల ఉత్సవానికి బంధువుల ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఒంటిగంట సమ యంలో షాపు నుంచి మంటలు రావడంతో షాపు యజమానికి కొందరు సమాచారం అందించారు.అదేసమయంలో కూతవేట దూరంలో ఉన్న అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన సకాలంలో స్పందించి శకటంచేరుకో లేదు. తర్వాత అక్కడకుచేరుకున్నా వాహనంలోనీరులేదు. దీంతో నీటికోసం చెరువు వద్దకు వెళ్లన తర్వాత అగ్నిమాపక వాహనం మొరాయించింది. విధిలేని పరిస్థితిలో పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చా రు.పాలకొండ నుంచి అగ్నిమాపకశకటం చేరుకునే సరికి మూడు గంటలు పట్టడంతో షాపు మొత్తం దగ్ధమయ్యింది. ప్రమాద స్థలానికి 100 మీటర్లు దూరంలో ఉన్న అగ్నిమాపక వాహనం సకాలంలో చేరుకోకపోవడం వల్ల తామంతా చూస్తుండగా షాపు దగ్ధమయ్యిందని పలువురు వాపోయారు. షాపులో ప్లేఉడ్‌,పెయింట్‌ ఇతర సామగ్రిఉండడంవల్ల మంటలు ఎగసిపడ డంతోచుట్టుపక్కల షాపులు యజమానులు భయాందోళనకు గురయ్యారు. రాజస్థాన్‌ నుంచి వలసవచ్చి వ్యాపారం ప్రారంభించి వ్యాపారం సజావుగా సాగుతున్నతరుణంలో అగ్నిప్రమాద రూపంలో నష్టంజరగడంతో కుటుం బ సభ్యులు లబోదిబోమంటున్నారు. షార్ట్‌ సర్కూట్‌ వల్ల లేకపోతే మరే ఇతరకారణాల వల్ల ప్రమాదం జరిగిందోనని విషయం తెలియాల్సిఉంది.

Updated Date - Sep 29 , 2025 | 11:37 PM