వంశధార కాలువలో జలకళ
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:58 PM
మండలంలోని వంశధార ప్రధాన ఎడమకాలువలో జలకళ నెలకొంది. ఇటీవల కాలువలో మరమ్మతులు చేపట్టడంతో ఎగువ నుంచి వస్తున్న నీరు ఉధృతంగా ముందుకు వెళ్తోంది. మండలంలో గొల్లూరు నుంచి జడ్యాడ, కవిటి మీదుగా సైలాడ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువలు ప్రవహిస్తున్నాయి.
నందిగాం, జూలై 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని వంశధార ప్రధాన ఎడమకాలువలో జలకళ నెలకొంది. ఇటీవల కాలువలో మరమ్మతులు చేపట్టడంతో ఎగువ నుంచి వస్తున్న నీరు ఉధృతంగా ముందుకు వెళ్తోంది. మండలంలో గొల్లూరు నుంచి జడ్యాడ, కవిటి మీదుగా సైలాడ వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువల ద్వారా ఎనిమిది వేల ఎకరాలకు నీరందుతోంది. సుభద్రాపురం ఎత్తిపోతల పథకం ద్వారా సుభ్రదాపురం, పాలవలస, నీలాపురం, నందిగాం గ్రామాల్లోని మరో 200 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు.ఈ ఏడాది కాలువల్లో పూడిక తొలగించడం, జూలై రెండో వారంలోనే నీరు ఎడమకాలువలో శివారు ప్రాంతాలకు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఏటా ఆగస్టు, సెప్టెంబరు రెండో వారం వరకూ కాలువల్లో నీటి ఉధృతి కనిపించేదికాదు. దీంతో నిరసనలు తెలియజేయ డంతోపాటు జలవనరులు, గ్రీవెన్స్‌లో అధికారులు రైతులు వినతిప త్రాలు ఏటా అందించే వారు. వంశధార కాలువల ద్వారా ముందుగానే నీరు రావడంతో చెరువులు నింపడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఎండిన ఎదపొలాలు, నారు మడులను తడుపుతున్నారు.