వంశధార ఆర్‌ఎంసీలో జలకళ
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:49 PM
వంశధార ప్రధాన ఎడమ కాలువకు(ఆర్‌ఎంసీ) సాగునీరు విడిచిపెట్టడంతో జలకళ సంతరించుకుంది.
జలుమూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి) వంశధార ప్రధాన ఎడమ కాలువకు(ఆర్‌ఎంసీ) సాగునీరు విడిచిపెట్టడంతో జలకళ సంతరించుకుంది. ఈనెల రెండో తేదీన హిరమండలం గొట్టాబేరేజీ వద్ద వంశధార ప్రధాన ఎడమ కాలువకు సాగు నీరు విడిచిపెట్టిన విషయం విదితమే.ఆ నీరు ప్రస్తుతం జలుమూరు, పెద్దదూగాం, రాణ వరకు చేరుకుంది.ఈ ఏడాది ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభంలోనే కాలువలకు నీరు విడచిపెట్టడంతో రైతులు పనులు ముమ్మరంగా చేస్తున్నారు. నారుమళ్లు తయారు చేసి దమ్ము చేయడానికి పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు.