Share News

కందిరీగల దాడి

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:35 AM

25 people injured కందిరీగల దాడిలో ఇచ్ఛాపురం మండలం చీకటి బలరాంపురం గ్రామానికి చెందిన 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమారు 40 మంది స్థానిక శివాలయంలో సోమవారం పూజలు చేశారు.

కందిరీగల దాడి
ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులు..

25 మందికి గాయాలు

ఇచ్ఛాపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కందిరీగల దాడిలో ఇచ్ఛాపురం మండలం చీకటి బలరాంపురం గ్రామానికి చెందిన 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమారు 40 మంది స్థానిక శివాలయంలో సోమవారం పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలో చెట్టు వద్ద వనభోజనాల కోసం వంటలు చేస్తున్నారు. అదే సమయంలో ఓ గెద్ద ఎగురుతూ వచ్చి.. చెట్టుకు ఉన్న కందిరీగల పుట్టను తాకింది. దీంతో కందిరీగలు చెల్లాచెదురై అక్కడ ఉన్న మహిళలు, చిన్నారులు, వృద్ధులపై దాడి చేశాయి. బాకి లక్ష్మి, యశ్మిత, రాజేశ్వరి, ఆశి దేవరాజు, ధనలక్ష్మి, మోక్షిత్‌, యశ్వంత్‌తోపాటు మొత్తంగా 25 మందికి శరీరం, ముఖంపై గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.దేవేంద్రరెడ్డి, సిబ్బంది చికిత్స చేశారు. ముఖం, శరీరంలోకి చొరబడిన కందిరీగల ముల్లులను తొలగించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని డాక్టర్‌ దేవేంద్ర రెడ్డి తెలిపారు.

Updated Date - Oct 28 , 2025 | 12:35 AM