మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:10 AM
lokesh tour రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు గురువారం రాత్రి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు.
కొత్తూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు గురువారం రాత్రి కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం(పీటీఎం)లో మంత్రి లోకేశ్ పాల్గొనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రే ఆయన జిల్లా మీదుగా భామిని చేరుకున్నారు. పాలకొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు.. మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికి కాసేపు ముచ్చటించారు. అలాగే కొత్తూరులో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి, అధిక సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అందరికీ లోకేశ్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించారు.