సమస్యలపై నిరసన గళం
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:51 PM
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అరసవల్లి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిం చాలని ఆ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అసోసియేషన్ జిల్లా అధ్యఽక్షుడు దాసరి కిరణ్ మాట్లా డుతూ.. రెండు దశాబ్దాలుగా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో కార్మికులుగా 220 పనిచేస్తు న్నారని, కాంట్రాక్టరు ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. రావాల్సిన జీతాలను సకాలంలో చెల్లించకపోగా.. ఒక్కోక్కరి నుంచి రూ.2000 నుంచి రూ.3000 వరకు కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. వేతనాలన నేరుగా కార్పొరేషన్ ద్వారా ప్రతీనెలా 10వ తేదీలోగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధి కారి నవీన్‌కుమార్, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. అలాగే టెక్కలి ఆర్టీసీ గ్యారే జ్, పలాస డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. టెక్కలి కార్యదర్శి పి.రాజా, ఎంప్లాయస్ యూనియన్ నాయకుడు ఎ.దిలీప్‌కుమార్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్య క్షుడు ముత్యాల రావు, కిరణ్‌కుమార్, కార్యదర్శి సంతోష్, బి.గోపి, పి.దివాకర్, కృష్ణ, శ్రీను, శంకర్, రాజేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.