Share News

సైకిల్‌పై విజయవాడ కనక దుర్గమ దర్శనానికి

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:21 AM

విజయవాడ కనక దుర్గమ్మ మొక్కులు చెల్లించుకోవాలని పలాస, సోంపేట ప్రాంతానికి చెందిన పొందర రవికుమార్‌, మడ్డు శంకరరా వు, బతకల దీర్ఘారావు మంగళవారం సైకిల్‌పై బయలుదే రారు.

సైకిల్‌పై విజయవాడ కనక దుర్గమ దర్శనానికి
విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి సైకిల్‌పై బయలుదేరిన భక్తులు

పలాస, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): విజయవాడ కనక దుర్గమ్మ మొక్కులు చెల్లించుకోవాలని పలాస, సోంపేట ప్రాంతానికి చెందిన పొందర రవికుమార్‌, మడ్డు శంకరరా వు, బతకల దీర్ఘారావు మంగళవారం సైకిల్‌పై బయలుదే రారు. ఈ మేరకు స్థానిక రైల్వేస్టేషన్‌లో సీతారామాల యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. సుమారు 700 కిలోమీటర్లు తాము సైకి ల్‌పై వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటామన్నారు. ఈ సంద ర్భంగా యాత్రికులు మాట్లాడుతూ.. పదేళ్ల కిందట మొక్కు కున్నామని.. ఇప్పుడు చెల్లించుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 12:21 AM