Share News

మహిళలపై హింసను నిర్మూలించాలి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:27 PM

మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు.

మహిళలపై హింసను నిర్మూలించాలి
మాట్లాడుతున్న సీనియర్‌ న్యాయాధికారి నిర్మల

- సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి నిర్మల

టెక్కలి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలని సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బి.నిర్మల అన్నారు. మహిళలపై హింస నిర్మూలనా దినం సందర్భం గా మంగళవారం మహిళా సమైఖ్య కార్యాలయంలో స్వయంశక్తి సంఘాల మహిళలతో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలను మానసికంగా, శారీరకంగా హింసించడం చట్టరీత్యా నేరమని, అందుకు కఠిన శిక్షలు విధించబడతాయని తెలిపారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, ఏజీపీ దివ్వల వివేకానంద, సనపల జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మహిళల రక్షణకు చట్టాలు

పలాస, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మహిళల రక్షణకోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిపై అవగాహన అవసరమని పలాస జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి యు.మాధురి అన్నారు. మ హిళలపై హింస నిర్మూలనా దినం సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా న్యాయాధికారి మాట్లాడుతూ.. వరకట్న నిషేధ చట్టం, గృహహింస నిరోధకచట్టం, మనోవర్తి వంటి చట్టాలు ఉన్నప్పటికీ మహిళలకు వాటిపై అవగాహన లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. డిసెంబరు 13న జరిగే లోక్‌అదాలత్‌లో ఎక్కువగా పెండింగ్‌ కేసులను రాజీ చేసుకోవాలని కోరా రు. ఏపీపీ రమేష్‌, సీఐ తిరుపతిరావు, ఏఎస్‌ఐ గోవిందరాజు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన కల్పించాలి

నరసన్నపేట, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాలని స్థానిక సివిల్‌ కోర్టు న్యాయాధికారి, మండల న్యాయసేవాధికారి సంస్థ చైర్‌పర్సన్‌ ఎస్‌.వాణి సూచించారు. మంగళవారం స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టులో మహిళా చట్టాలు- రక్షణ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళలపై జరుగుచున్న అరాచకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ వాన శ్రీనివాసరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కొండలరావు, న్యాయవాఽదులు ఆర్‌కే నాయుడు, టి.మధుసూదనరావు, జి.అప్పారావు, వై.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు సంపూర్ణ భద్రత

పాతపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై అవగాహనతో మహిళలకు సంపూర్ణ భద్రత ఉంటుందని పాతపట్నం జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మానెం రోషిణి తెలిపారు. మహిళలపై హింస నిర్మూలనా దినం సందర్భంగా మంగళవారం స్థానిక కోర్టుప్రాంగణంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి మద్దిల రమణ, న్యాయవాది యు.దాల య్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:27 PM