Share News

సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:36 PM

గిరిజన గ్రామాల అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి
సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

హిరమండలం, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ధర్తి ఆభాజన్‌ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్‌ (డీఏ జుగా), పీఎం జన్‌మాన్‌ పథకాల లక్ష్యాలను సాధించాలని సూచించా రు. మర్రిగూడ గిరిజన గ్రామంలో బుధ వారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు పలు సమస్య లను ఆయన దృష్టికి తీసు కువెళ్లారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉండడం వల్ల హౌసింగ్‌ పట్టాలు మంజూరు చేయడం లేదని స్థానికులు పేర్కొ న్నారు. నివాస ప్రాంతానికి వస్తే గిరిజనులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ‘తల్లికి వందనం’ రాలేదని పలు వురు పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో విద్యు త్‌ స్తంభాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అదనపు స్తంభాలు వేయా లని కోరారు. గిరిజనుల సమస్యలను తెలుసు కునేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావే శానికి ఐటీడీఏ అధికారులు రాక పోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీడీఏ డీఈఈ సిమ్మయ్య పనితీరు సక్రమంగా లేద న్నారు గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా నన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పి.బుచ్చి బాబు, ఎంపీడీవో కాళీప్రసాదరావు, మండల ప్రత్యే ఆహ్వానితుడు టి.తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం హిరమం డలంలో రూ.25 లక్షలతో చేపడుతున్న రోడ్డు పనుల ను ఎమ్మెల్యే పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Jun 25 , 2025 | 11:36 PM