సందడిగా గ్రామదేవత ఉత్సవాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:08 AM
ప్రతాపవిశ్వనాథపురం, మదనాపురం గ్రామాల్లో గ్రామదేవత ఉత్సవాలు రెండోరోజు సోమవారం సందడిగా సాగాయి.
నందిగాం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): ప్రతాపవిశ్వనాథపురం, మదనాపురం గ్రామాల్లో గ్రామదేవత ఉత్సవాలు రెండోరోజు సోమవారం సందడిగా సాగాయి. పగటి వేషాలు, కోలాటం, కాళికా నృత్యాలతో వేషధారణలు ఆకట్టుకున్నాయి. గ్రామదేవతలకు మహిళలు ముర్రాటలు సమర్పించి చల్లదనం చేశారు. పీవీపురంలో ఆదివారం రాత్రి సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు. సత్యహరిశ్చంద్రునిగా కణితి సూర్యనారా యణ, నక్షత్రకుడిగా వాసునాయుడు, చంద్రమతిగా పద్మావతి తమ పాత్రల్లో జీవించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మర్రి పోలేరమ్మకు ప్రత్యేక పూజలు
మెళియాపుట్టి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలో రెండు రోజులుగా మర్రి పోలేరమ్మ సంబరాలు ఆనందోత్సాహాల నడుమ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అమ్మ వారిని ఊరేగించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహి ళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ముర్రాటలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.