జల్‌జీవన్ పనుల పర్యవేక్షణకు గ్రామ కమిటీలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:48 PM
Jaljeevan works జల్‌జీవన్ మిషన్ పనుల వేగవంతానికిగాను క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డిప్యూటీ ఎంపీడీవోలను ఆదేశించారు.
నీటి నాణ్యత కిట్లు కొనుగోలు చేయాలి
కలెక్టర్ స్వప్నిల్ దినక ర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి) ః జల్‌జీవన్ మిషన్ పనుల వేగవంతానికిగాను క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణకు గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డిప్యూటీ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘ప్రతీ గ్రామంలో విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండాలి. అందులో సగం మంది మహిళలు తప్పనిసరి. సర్పంచ్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జేజేఎంకు సంబంధించిన అన్ని పనులు ఈ కమిటీ తీర్మానం ద్వారానే జరగాలి. ‘హర్ ఘర్ జల్’ డిక్లరేషన్ సాధించే ప్రక్రియ వేగవంతం చేయాలి. డిక్లరేషన్‌కు సంబంధించి ఒక్క నిమిషం నిడివి గల వీడియోను రికార్డు చేయాలి. నీటి నాణ్యతను పరీక్షించడానికి అవసరమైన కిట్‌లను వెంటనే కొనుగోలు చేయాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, డీపీఓ భారతీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.