Vigilance inspectionఅటవీ ప్రాంతంలో విజిలెన్స్ తనిఖీ
ABN , Publish Date - Apr 30 , 2025 | 11:54 PM
Vigilance inspection కాశీబుగ్గ అటవీ రేంజి మందస సెక్షన్ హొన్నాళి అటవీ ప్రాంతంలో విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వ ర్యంలో సంబంధిత అధికారులు బుధవారం తనిఖీ చేపట్టారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
హరిపురం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కాశీబుగ్గ అటవీ రేంజి మందస సెక్షన్ హొన్నాళి అటవీ ప్రాంతంలో విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆధ్వ ర్యంలో సంబంధిత అధికారులు బుధవారం తనిఖీ చేపట్టారు. ఏప్రిల్ 21న ‘మొక్కల పేరుతో మెక్కేశారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి విజిలెన్స్ అధికారులు స్పందించారు. విజి లెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించారు. రికార్డులో నమోదు చేసి పనులు జరిగియా లేదా అనే అంశాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికా రులకు అందించను న్నట్లు వారు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ వై.గోవిందరావు, డీఈ ఈ సత్యనారా యణ, జియాలజిస్ట్ సురేష్ కుమార్, ఏఈ గణేష్, పలువురు అటవీశాఖాధికారులు పాల్గొన్నారు.