ఆదిత్యుని సేవలో విజిలెన్స్ కమిషనర్
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:47 PM
ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్, పూర్వపు చీఫ్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేఠా శనివారం దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అరసవల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష దైవం, ఆరోగ్యప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్, పూర్వపు చీఫ్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేఠా శనివారం దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామి వారి చిత్ర పటం, ప్రసాదాన్ని ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ అందజేశారు. రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ పునేఠాను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్‌కుమార్, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, ఎమ్మెల్యే గొండు శంకర్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈయన గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేశారు. భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేపి పదవీ విరమణ అనంతరం 2024 అక్టోబరులో విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులయ్యారు. స్థానిక కలెక్టర్ బంగ్లా వద్ద ఆంజనేయస్వామిని పునేఠా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.