స్ర్కీనింగ్ పరీక్షతో క్యాన్సర్‌పై విజయం
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:42 PM
cancer screening test స్ర్కీనింగ్ పరీక్ష చేయించుకుని, తొలిదశలోనే గుర్తించడం ద్వారా క్యాన్స ర్‌పై విజయం సాధించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.అనిత తెలిపారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాల యం వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆమె జెం డా ఊపి ప్రారంభించారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.అనిత
అరసవల్లి, నవంబరు 7(ఆంధ్ర జ్యోతి): స్ర్కీనింగ్ పరీక్ష చేయించుకుని, తొలిదశలోనే గుర్తించడం ద్వారా క్యాన్స ర్‌పై విజయం సాధించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.అనిత తెలిపారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాల యం వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆమె జెం డా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ‘క్యాన్సర్ వ్యాధి పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో అధిక మరణాలు గుండె జబ్బులు ద్వారా సంభవిస్తే, క్యాన్సర్ వ్యాధి మరణాలు రెండో స్థానంలో ఉన్నాయి. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే వైద్యారోగ్యశాఖ సిబ్బంది వచ్చి క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, ఇన్‌ఫెక్షన్ల ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ’ని తెలిపారు. నోటి, బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా.శివరంజని, డీఐఓ డా.రాందాసు, రెడ్‌క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, పోగ్రాం అధికారి డా.శివరంజని, మోహిని, మురళి, సిబ్బంది, పాల్గొన్నారు.