Share News

అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:13 AM

: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

 అట్రాసిటీ బాధితులకు అండగా ఉండాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వ రరెడ్డితో కలిసి జిల్లావిజిలెన్స్‌, మోనటరింగ్‌కమిటీ సమా వేశం నిర్వహించారు. అక్టోబరులో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఉద్యోగ నియామకాలను సత్వరమే పూర్తి చేసి వారికి భరోసా కల్పించాలని కోరారు.2017నుంచి ఈ ఏడాది వర కు జిల్లాలో నమోదైన 12 హత్య కేసుల్లో బాధిత కుటుంబ సభ్యుల విద్యార్హతలను బట్టి 12 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపా రు. భూవివాదాలను త్వరితగతిన పరిష్కరించి, న్యాయం చేయాలన్నారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలపై తీసు కున్న చర్యల నివేదికలను సిద్ధం చేయాలని డీఆర్వోను ఆదేశించారు.ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తిచేయాలని పోలీసుఅధికారులకు సూచించా రు.వివిధ సంఘాలసభ్యులు కలెక్టర్‌కు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మె ల్యే బగ్గు రమణమూర్తి, డీఆర్వో లక్ష్మణమూర్తి, పలాస ఆర్డీవో వేంకటేష్‌, సాంఘిక సంక్షేమ శాఖ ఏడీ మధు సూదనరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు, దండాసి రాంబాబు, తోట రాములు, అప్పన్న, సత్యన్నారా యణరాజు, ప్రభాకరరావు, దాలయ్య పాల్గొన్నారు. కాగా కలెక్టరేట్‌లో ఇండియన్‌ సొసైటీ ఫర్‌ కల్చరల్‌ కోపరేషన్‌ అండ్‌ ఫ్రెండ్‌షిప్‌(ఇస్కఫ్‌) కొత్త సంవత్సర క్యాలెండర్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆవిష్కరించారు.

Updated Date - Dec 23 , 2025 | 12:13 AM