వెలమ కులస్థులను బీసీ-ఏలో చేర్చాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:22 AM
సామాజకంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వెలమ కలాన్ని బీసీ-ఏ జాబితాలో చేర్చాలని వెలమ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
నరసన్నపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): సామాజకంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వెలమ కలాన్ని బీసీ-ఏ జాబితాలో చేర్చాలని వెలమ సంక్షేమ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జమ్ము జంక్షన్ వద్ద గల ఒక కల్యాణ మండపంలో జిల్లా వెలమ సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు. గతంలో బీసీ-డీలో సామాజికంగా చైతన్యం, తెలివైన కులాలను చేర్చడంతో వెలమ కులస్థులు ఉద్యోగాలు, ఉన్నత చదువులు కోసం రిజర్వేషన్‌లో సీట్లు కోల్పయిన పరిస్థితితో వెలమ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెలమ కులంకు బీసీ-ఏ జాబితాలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘ నాయకులు దుంగ సుధాకర్, దండుగుల పార్థసారఽథి, డాక్టర్ పొన్నాడ గణేష్, పోగోటి రాజారావు, డాక్టర్ సూరపు కృష్ణారావు, గొండు స్వామి, గొద్దు చిట్టిబాబు, ఇప్పిలి వేణుగోపాలరావు, రఘు, శిమ్మ జగన్నాథం, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.