పెంటలో వీరభద్రస్వామి తిరువీథి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:16 AM
పెంటలో కురివి వీరభద్రస్వామి తిరువీథిని సోమవారం నిర్వహించారు. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని వీరభద్ర స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జి.సిగడాం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): పెంటలో కురివి వీరభద్రస్వామి తిరువీథిని సోమవారం నిర్వహించారు. కార్తీక మూడో సోమవారం పురస్కరించుకొని వీరభద్ర స్వామి వారికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంగరంగ వైభవంగా మేళతాళాల మధ్య ఊరేగించారు. గౌరీదేవి నోములునోచారు. ఈసందర్భంగా సాంస్కృతిక, జానపద కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అలుగోలు, సింహద్రి పాల్గొన్నారు.
.