Share News

భక్తిశ్రద్ధలతో వత్సవలసలో జాతర

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:00 AM

మండలంలోని చిన్న వత్సవలసలో రాజమ్మతల్లి జాతరసంబరాలు భక్తిశ్రద్ధలతో ఆదివారంనిర్వహించారు.ఉదయం భక్తులు సము ద్ర స్నానాలు ఆచరించి భూలోక్మ, రాజమ్మలను దర్శించిమొక్కులు చెల్లించుకున్నా రు.

 భక్తిశ్రద్ధలతో వత్సవలసలో జాతర
గార: వత్సవలస రాజమ్మ జాతరకు తరలివచ్చిన భక్తులు

గార, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్న వత్సవలసలో రాజమ్మతల్లి జాతరసంబరాలు భక్తిశ్రద్ధలతో ఆదివారంనిర్వహించారు.ఉదయం భక్తులు సము ద్ర స్నానాలు ఆచరించి భూలోక్మ, రాజమ్మలను దర్శించిమొక్కులు చెల్లించుకున్నా రు. పలువురు భక్తులు వాహనాల్లో రాగా.. కొందరు కాలినడకన వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ పైడపు నాయుడు,ఎస్‌ఐ ఆర్‌.జనార్దన్‌ బందోబస్తు, మెరైన్‌ సీఐ బి.ప్రసాదరావు ఆధ్వర్యం లో గస్తీ నిర్వహించారు. కాగాశ్రీకూర్మం ఆలయంఆదివారం భక్తులతో కిటకిటలా డింది. రాజమ్మతల్లి యాత్ర నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులు శ్రీకూర్మనా థుని దర్శించుకున్నారు. ఈవో గురునాథం ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేశారు.

సరుబుజ్జిలిలో నవగ్రహాల ప్రతిష్ఠ

సరుబుజ్జిలి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఉమారామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో మూడురోజులుగా నవగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పెద్ది సీతారాం దంపతులు నవగ్రహ మండపాన్ని నిర్మించగా సర్పంచ్‌ బొడ్డేపల్లి చాందిని హరిబాబు ఆధ్వర్యంలో పలువురు విగ్రహాలను ఏర్పాటు చేశారు. యాగశాలలో మావుడూరు లక్ష్మీనారాయణ భుక్త ఆధ్వర్యంలో వేద పండితులు హోమాలు, యజ్ఞాలు నిర్వహించారు.

వినాయక విగ్రహం..

కవిటి, మార్చి9 (ఆంధ్రజ్యోతి): కవిటిలోని చంద్రశేఖరాలయంలో నిర్మించిన మండపం, ఉపఆలయాలను ఆదివారం ప్రారంభించారు. ప్రశాంత్‌ పాడి, చంద్ర శేఖర శతపతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి, వినాయకుడు, సుబ్రమణ్య స్వామి విగ్రహాలను ఊరేగించి ప్రతిష్ఠించారు.కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బి.అశోక్‌, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగ్వర్‌వాల్‌,జడ్పీ చైర్‌పర్సన్‌ పి.విజయమ్మ, ఎమ్మెల్సీ ఎన్‌.రామారావు పాల్గొన్నారు.

గరుడవాహనం..

కవిటి బెజ్జిపుట్టుగలోని చక్రధరపెరుమాళ్ల స్వామి ఆలయంలో గరుడవాహన ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్రగడపుట్టుగకు చెందిన పి.బలరాంమూర్తి తమిళనాడులోని కుంభకోణంలో తయారుచేయించి ఆలయానికి అందించారు. డోలోత్సవాల్లో భాగంగా పూజలను నిర్వహించి గరుడవాహన సేవను చేపట్టారు.

మఠంసరియాపల్లిలో సింధుపోలమ్మ సంబరం

కంచిలి, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మఠంసరియాపల్లిలో ఆదివారం సింధు పోలమ్మతల్లి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో సంబరం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళతాళాలతో అమ్మవారి గజముద్దను ఊరేగించారు. కార్యక్రమంలో ఆటోయూనియన్‌ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

కాళీమాత ఆలయ వార్షికోత్సవం

ఇచ్ఛాపురం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని డబ్బూరివీధి జంక్షన్‌లో గల దక్షిణకాళీమాత మందిరం, పంచముఖ ఆంజనేయ ఆలయం వార్షికో త్సవం ఆదివారం నిర్వహించారు.ఉదయం ఆలయంలో ప్రత్యేకపూజలు, సాయంత్రం సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

గార, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని సిమ్మపేటలో ఆదివారం రాత్రి ఉమారామలింగేశ్వర స్వామివారి వార్షిక కల్యాణం వైభవంగా నిర్వహిం చారు.రాత్రి మేళతాళాలతో తిరువీధిఉత్సవం చేపట్టారు.అనంతరం అర్చకులు దార్లపూడి కామేశ్వరశర్మ శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. రాత్రి సాం స్కృతిక కార్య క్రమాలు నిర్వహించారు.

ఆదిత్యునికి కలెక్టర్‌ పూజలు

అరసవల్లి,మార్చి 9(ఆంధ్రజ్యోతి):అరసవల్లిలోని సూర్య నారాయణ స్వామి వారిని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుం డ్కర్‌ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకుని పూ జలు నిర్వహించారు. ఆదిత్య ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ స్వాగతం పలుకగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ సూపరింటెండెంట్‌ ఎస్‌.కనక రాజుస్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు రంజిత్‌శర్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:00 AM