వరిశాంను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:51 PM
: పైడిభీమ వరం నుంచి వరిశాంను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావును కలిసి వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ను కోరిన ప్రజలు
రణస్థలం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పైడిభీమ వరం నుంచి వరిశాంను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. పైడిభీమవరం పంచా యతీలో సుమారు 6 వేల ఓట్లు ఉన్నాయని, తాము పైడిభీమ వరం పంచాయతీలో ఉన్నప్పటికీ భౌగోళి కంగా దూరం, పంచాయతీ కార్యాలయానికి చేరుకు నేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గ్రామా ల అభివృద్ధి సకాలంలో జరగకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నామన్నారు. అందువల్ల వరిశాం పంచా యతీగా ఏర్పాటుకు కృషి చేయాలని వరిసాం, చిట్టివలస, చిల్లపేట, గొల్లపేట, సరగడ పేట తదితర గ్రామాల ప్రజలు కోరారు.