Republic Day: విలువలతో కూడిన విద్యను అందించాలి
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:05 AM
Republic Day: విలువలతో కూడిన విద్యను విద్యార్థు లకు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు సూచించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 26(ఆంధ్ర జ్యోతి): విలువలతో కూడిన విద్యను విద్యార్థు లకు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులు, ఉపాఽధ్యాయులు, విద్యార్థుల తల్లి దండ్రులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయం అందరికీ అందించడమే రాజ్యాంగ దినోత్సవం లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత శిఖరాలకు చేరుకో వాలని కోరారు. ఎవరూ సెల్‌ఫోన్లకు బానిసలు కావద్దని సూచించారు. గరుడభద్ర జడ్పీ హై స్కూల్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీఈవో రవిబాబు, విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదం డ్రులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయస్థానంలో..

రాజ్యాంగ పీఠిక చదువుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి జూనైద్ అహ్మద్ మౌలానా
శ్రీకాకుళం లీగల్, నవంబరు 26 (ఆంధ్రజ్యో తి): జిల్లా న్యాయస్థానంలో బుధవారం రాజ్యాం గ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. న్యా యస్థానం పోర్టికోలో జిల్లా ప్రధాన న్యాయాధి కారి జూనైద్ అహ్మద్ మౌలానా రాజ్యాంగ పీఠికను చదవగా మిగిలిన న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది అనుసరించారు. ఈ కార్యక్రమం లో 1, 3, 4, 7 కోర్టుల అదనపు జిల్లా న్యాయాధి కారులు పి.భాస్కరరావు, వివేకానందశ్రీనివాస్, ఎస్.ఎం.ఫణికుమార్, తిరుమలరావు, పోక్సో న్యాయాధికారి నక్క సుజాత, జిల్లాన్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి కె.అనురాగ్, అదనపు జూనియర్ న్యాయాధికారి జమృత బేగం తదితరులు పాల్గొన్నారు