వాల్మీకి బోధనలు మానవాళికి మార్గదర్శకం
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:06 AM
వాల్మీకి మహర్షి బోధనలు మానవాళికి మార్గ దర్శకాలని డీఆర్వో ఎం. వేంకటేశ్వరరావు అన్నారు. కలెక్ట రేట్ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు.
డీఆర్వో ఎం.వేంకటేశ్వరరావు
శ్రీకాకుళం కలెక్టరేట్, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): వాల్మీకి మహర్షి బోధనలు మానవాళికి మార్గ దర్శకాలని డీఆర్వో ఎం. వేంకటేశ్వరరావు అన్నారు. కలెక్ట రేట్ సమావేశ మందిరంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మానవజాతి మనుగడ ఉన్నంతకాలం ఇవి సజీవ మన్నారు. వాల్మీకి నిర్దేశించిన విలువలను పాటిస్తూ జీవనం సాగిస్తే మానవ సమాజమే ఒక నందనవనంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి అనూరాధ, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ, జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ, సెట్విన్ సీఈవో అప్పలనాయుడు, ప్రవల్లిక తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రప టానికి ఏఎస్పీ కేవీ రమణ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ.. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆలో చనల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శేషాద్రి, ఏవో గోపీనాథ్, సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐలు నరసింగరావు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
బీఆర్‌ఏయూలో..
ఎచ్చెర్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూని వర్సిటీలో మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని పూలమాల వేసి నివాళులర్పించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేందుకు వాల్మీకి జీవితమే నిదర్శన మన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు, కె.సామ్రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.