జిల్లా ఖ్యాతిని ఇనుమడించిన ‘వడ్డాది’
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:36 PM
ప్రకృతి వనరులను ఉపయోగించి చిత్రాలను మలచి జిల్లా ఖ్యాతిని ఇనుమడించిన వ్యక్తి వడ్డాది పాపయ్య అని వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఇందిరా ప్రసాద్ అన్నారు. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జయంతిని స్థానిక క్రాంతి భవన్‌లో భారత సాంస్కృతిక సహకార సేవా సంఘం (ఇస్కఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
శ్రీకాకుళం కల్చరల్ సెప్టెంబరు10 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వనరులను ఉపయోగించి చిత్రాలను మలచి జిల్లా ఖ్యాతిని ఇనుమడించిన వ్యక్తి వడ్డాది పాపయ్య అని వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ ఇందిరా ప్రసాద్ అన్నారు. ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జయంతిని స్థానిక క్రాంతి భవన్‌లో భారత సాంస్కృతిక సహకార సేవా సంఘం (ఇస్కఫ్) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పాపయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చందమామ, స్వాతి, నవ్య, విజయ తదితర పత్రికల ముఖ చిత్రాల్లో వడ్డాది పాపయ్య వేసిన బొమ్మలు చిరస్థాయి కీర్తిని పొందా యన్నారు. కార్యక్రమంలో ఇస్కఫ్ జిల్లా అధ్యక్షుడు ఎంవీ మల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జీవీ నాగ భూషణరావు, వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, రాష్ట్ర బాడీ బిల్డిం గ్ అసోసియేషన్ సెక్రటరీ వడ్డాది విజయకుమార్, పి.రాఘవేంద్రరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.