Share News

యుటీఎఫ్‌ నాయకుల అరెస్టు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:35 PM

: పలాసలో యూటీఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం పలాస ఆర్టీసీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌ వరకూ రణభేరి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు యుటీఎఫ్‌ నాయకులు పిలుపుఇచ్చారు.

యుటీఎఫ్‌ నాయకుల అరెస్టు
కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో అరెస్టయిన యూటీఎఫ్‌ నాయకులు:

పలాస, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పలాసలో యూటీఎఫ్‌ నాయకులను పోలీసులు అరెస్టుచేశారు. సోమవారం పలాస ఆర్టీసీ కార్యాలయం నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌ వరకూ రణభేరి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసేందుకు యుటీఎఫ్‌ నాయకులు పిలుపుఇచ్చారు. ఈ మేరకు యూటీఎఫ్‌ నాయకులు కాంప్లెక్స్‌కు చేరుకోగా కాశీబుగ్గ పోలీసులు ర్యాలీకి అను మతి ఇవ్వలేదు. ఈ సందర్భంగా యుటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు ఢంకా మోగించి రణభేరి కార్యక్రమాన్ని ప్రారంభించగా, డీఎస్పీ వి.వెంకట అప్పా రావు వారితో మాట్లాడారు. జంటపట్టణాల్లో 30 పోలీసు యాక్ట్‌ అమలులో ఉందని, ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని కోరారు. తాము శాంతియుతంగా ర్యాలీ చేస్తా మని అనుమతించాలని నాయకులు కోరారు. దీంతో పోలీసులు, సంఘ నాయ కుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం వెంకటేశ్వరరావుతోపాటు రాష్ట్ర కార్యదర్శి కిషోర్‌కుమార్‌, కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు, ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తితో పాటు నాయకులందర్ని పోలీసు లు కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచిక త్తుపై వారిని విడిచిపెట్టారు.కాగా అరెస్టుల ద్వారా ఉద్యమాలు ఆపలేరని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. పలాసలో ఆయన విలే కరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రక్షణ, విద్యా ర్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం రణభేరి కార్యక్రమం చేపట్టడం తప్పా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జి.గిరిధర్‌, ఎల్‌వీ చలం, దమయంతి, స్వర్ణకుమారి, రవికుమార్‌, కోదండరావు, మధుసూదనరా వు, సంజయ్‌కుమార్‌, ధనలక్ష్మి పాల్గొన్నారు.

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

నందిగాం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. నందిగాంలో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన రణభేరీ జాత కార్యక్రమం లో భాగంగా ఉపాధ్యాయుల నుంచి సోమవారం వినతులు స్వీకరించారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.కిషోర్‌కుమా ర్‌, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎల్‌.బాబూరావు, శ్రీరా మ్మూర్తి, కార్యదర్శి బాలక శంకరరావు, మండలశాఖ ప్రతినిధు లు కె.కుమారస్వామి, సురేష్‌, అప్పలస్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:35 PM