డిపాజిట్ పథకాన్ని వినియోగించుకోండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:00 AM
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ)ని స్థాపించి 89 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా ప్రవేశపెట్టిన నవతి’ ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
కోటబొమ్మాళి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (డీసీసీబీ)ని స్థాపించి 89 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతనంగా ప్రవేశపెట్టిన నవతి’ ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం బ్యాంకు అధికారులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు. 900 రోజుల కాలపరిమితితో అమలు చేస్తున్న ఈ పథకంలో సీనియర్ సిటిజన్లకు 9శాతం, ఇతరులకు 8.5శాతం వడ్డీ చెల్లించనున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ లక్ష్య సాధనలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం డీసీసీబీ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఎస్.సూర్యనారాయణ, బ్యాంకు ఉద్యోగులు సత్యనారాయణ, వరప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.