యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:57 PM
రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా యూరియా పంపిణీ చేయాలని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి మండల అధికారులను ఆదేశించారు.
జలుమూరు (సారవకోట), సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా యూరియా పంపిణీ చేయాలని టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి మండల అధికారులను ఆదేశించారు. ధర్మలక్ష్మీపురం రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. యూరియా ఎరువు నేరుగా రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తుందని వ్యవసాయ సహయకులు యూరియా పంపిణీ చేసినప్పుడు అర్హులైన రైతులకు అన్యాయం జరుగకుండా వన్-బీ లేదా పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా యూరియా పంపిణీ చేయాలన్నారు. యూరియా పంపిణీ ఆధార్‌కార్డు ఆధారంగా పంపిణీ జరిగితే అసలైన రైతులకు అన్యాయం జరిగి పక్కతోవ పట్టే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ అధికారులు సూచనలు మేరకు యూరియా వాడేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు విజయలక్ష్మి, వ్యవసాయశాఖ ఏడీ ఎల్‌వీ మధు, వ్యవసాయాధికారి సీహెచ్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనవద్దు
ఎల్‌ఎన్ పేట, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందాల్సి అవసరంలేదని ఎంపీడీవో పి.శ్రీనివాసరావు తెలిపా రు. బొర్రంపేట, తురకపేట, యంబరాం తదితర గ్రామాల్లో ఆదివారం రైతులకు అవగాహన కలిగించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లా డుతూ.. రైతులందరికీ పూర్తిస్థాయిలో యూరి యా అందించేందుకు చర్యలు తీసుకుం టామ న్నారు. పంచాయతీ కా ర్యదర్శి జి.తవిటినా యుడు, రెవెన్యూ కార్యదర్శి కె.జోగినాయుడు, అగ్రి కల్చర్ అసిస్టెంట్ బి.పద్మజ, రైతులు పాల్గొన్నారు.
ఎరువుల వాడకంపై అవగాహన
హిరమండలం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రా బోయే కాలంలో ఎరువులు ఏ విధంగా వాడాలి, అధికంగా ఎరువులు వాడితే జరిగే నష్టాలపై జడ్పీ సీఈవో శ్రీధరరాజా రైతులు అవగాహన కల్పించా రు. ఆదివారం సుబలయ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఎరువులు నిల్వలు, వాడే విధానంపై రైతులకు వివరించారు. సోమవారానికి 1500 టన్నులు అందుబాటులో ఉంటుందన్నారు. రెండు రోజుల్లో మరో 1500 టన్నులు వస్తాయని చెప్పారు. కార్య క్రమంలో ఎస్‌ఐ వెంకటేష్, ఎంపీడీవో కాళీప్రసాద రావు, ఏవో సంధ్య, సర్పంచ్ సుందరమ్మ తదితరులు ఉన్నారు.
రైతులతో సమావేశం
వజ్రపుకొత్తూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా సరఫరా పై రైతులు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ సీ తారామయ్య, ఎంపీడీవో ఎన్.రమేష్‌నాయుడు, వ్య వసాయాధికారి ధనుంజ అన్నారు. ఆదివారం మం డలం నగరంపల్లి, రిట్టపాడు, పల్లిసారధి గ్రామం లో రైతులతో సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్త లు అభిప్రాయం ప్రకారం వరి పంటకు యూరి యాను మూడువిడల్లో వేయాలన్నారు. ఎకరాకు మొదటి విడతగా 25 కిలోలు వేయాలన్నారు. ఇ ప్పటికే మొదటి విడత యూరియా రైతలకు అం దించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
పూర్తిస్థాయిలో అందిస్తాం
పాతపట్నం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రైతు లందరికీ అవసరమైన యూరియా అందజేస్తామని మండల ప్రత్యేకాధికారి డాక్టర్ మంచు కరుణాకర రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఏఎస్ కవిటి, ఆర్‌ఎల్ పురం, సీది రైతుసేవా కేంద్రాల పరిధిలో రైతులకు యూరియా వాడకంపై అవగాహన కల్పించారు. మొదటి విడతగా 25 నుంచి 30రోజుల్లోగా, రెండ విడతగా 55 నుంచి 60రోజుల్లో, మూడో విడతగా 80నుంచి 90రోజుల్లో గా వినియోగించాన్నారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు లండ తాతబాబు, సీది స ర్పంచ్ చిన్నాల విశ్వనాఽథం గ్రామరైతులు నరేష్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.