యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:57 PM
యూరియా పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు.
- శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష
జలుమూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): యూరియా పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష అన్నారు. గొటివాడ రైతు సేవా కేంద్రంలో శనివారం జరిగిన యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అర్హత కలిగిన రైతులందరికీ యూరియా అందించే బాధ్యత వ్యవసాయశాఖపై ఉందన్నారు. రైతుల ఆధార్, 1బీ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని అన్నారు. తహసీల్దార్ జె.రామారావు, వ్యవసాయాదికారి కె.రవికుమార్, ఆర్‌ఐ కిరణ్, పలువురు రైతులు పాల్గొన్నారు.
రైతుల పాట్లు..
పలాసరూరల్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): టెక్కలిపట్నం సచివాలయం వద్ద శనివారం డీఏపీ, యూరియాను అధికారులు పంపిణీ చేశారు. కేవలం ఒక్కొక్క బస్తాను మాత్రమే ఇవ్వడంతో అధికంగా పొలం కలిగిన రైతులు పాట్లు పడ్డారు. అధికారులు ముందు జాగ్రత్తగా పోలీసు రక్షణ ఏర్పాటు చేశారు.
పెద్దపద్మాపురంలో నిరసన
మెళియాపుట్టి, సెప్టెంబరు 6 (ఆంరఽధజ్యోతి): పెద్దపద్మాపురం గ్రామానికి 106 బస్తాల ఎరువు వ చ్చింది. పంపిణీ కోసం శనివారం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఒక రైతుకు ఒక బస్తానే ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పారు. దీంతో ఆ ఎరువులు తమకు వద్దంటూ రైతులు నిరసన తెలిపారు. తహసీల్దార్ పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, ఏఎస్‌ఐ నచ్చజెప్పినా రైతులు వినలేదు.
సరిపడినవి ఇవ్వాలి..
టెక్కలి రూరల్,సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): రైతు లకు సరిపడిన ఎరువులు అందజేయాలని మెఖలింగ పురం, నర్సింగపల్లి పంచాయతీ రైతులు శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు విన్నవించారు. తక్కువ ఎరువులు ఇవ్వటంతో గ్రామాల్లో తగదాలు జరుగుతున్నాయని తెలిపారు. మంత్రికి కలినవారిలో మాజీ సర్పంచ్ పి.షన్ముఖరావు, డి.పాపారావు, పి.శంకరరావు తదితరులు ఉన్నారు.
నేడు, రేపు యూరియా పంపిణీ
నరసన్నపేట, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోమర్తి, జమ్ము, కామేశ్వరిపేట, కరగాం, తెలగలవలస, చిక్కాలవలస, ఉర్లాం రైతుసేవా కేంద్రాలకు(ఆర్‌ఎస్‌కే) యూరియా వచ్చినట్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి తెలిపారు. శనివారం జమ్ము ఆర్‌ఎస్‌కేలోని యూరియా స్టాక్‌ను ఆమె పరిశీలించారు. ఆదివారం ఉర్లాం, సోమవారం చిక్కాలవలస, కామేశ్వరిపేట, చోడవరం జమ్ము రైతు సేవాకేంద్రాల్లో యూరియా పంపిణీ చేయినున్నట్లు ఏవో సూర్యకుమారి తెలిపారు.
దుకాణాల తనిఖీ
హిరమండలం, సెప్టెంబరు6(ఆంధ్రజ్యోతి): మండ లంలోని పలు ఎరువుల దుకాణాలను వ్యవసాయ అధికారి సంధ్య, ఎంపీడీవో కాళీప్రసాదరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ ప్రసాదరావు శనివారం తనిఖీ చేశారు. రికార్డులు, నిల్వలు పరిశీలించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.