Share News

యూపీ తరగతులను కొనసాగించాలి

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:33 PM

హొన్నాళి గ్రామంలో ఏన్నో ఏళ్లుగా నిర్వహి స్తున్న యూపీ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

యూపీ తరగతులను కొనసాగించాలి
హొన్నాళి పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న మహిళలు

పాఠశాల ఎదుట ఆందోళన

హరిపురం, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): హొన్నాళి గ్రామంలో ఏన్నో ఏళ్లుగా నిర్వహి స్తున్న యూపీ పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. సుమారు 160 మంది విద్యార్థులున్న పాఠ శాలలోని 6, 7, 8 తరగతులను సుదూరం లోని పొత్తంగి సిరిపురం హైస్కూల్‌లో విలీనం చేయడం దారుణమన్నారు. చెరు వులు, రెండు గెడ్డలు దాటి పాఠశాలకు వెళ్లా లంటే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవు తు న్నారన్నారు. సమస్యలను గుర్తించి గ్రామం లోనే యూపీ తరగతులను కొనసా గించాల ని కోరారు. లేకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:33 PM