Share News

ఆధారాలు లేని ఆరోపణలు సరికాదు

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:15 PM

ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సరికాదని.. జగన్‌ మాయమాటలకు ప్రజలు లొంగిపోరని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

ఆధారాలు లేని ఆరోపణలు సరికాదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

శ్రీకాకుళం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి సరికాదని.. జగన్‌ మాయమాటలకు ప్రజలు లొంగిపోరని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఓట్లతో జగన్‌కు బుద్ధి చెప్పినా.. ఏమాత్రం మార్పురాకపోవడం బాధాకరమన్నారు. ప్రతితల్లి సంతోషంగా ఉండేందుకు ‘తల్లికి వందనం’ అమలుచేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని.. ఈ విషయంలో మంత్రి నారా లోకేశ్‌ ఎంతో కృషి ఉందన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు ఈ పథకం వర్తింపజేస్తే.. ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం దుర్మార్ఘమని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌, మహిళా నాయకులు కె.సుశీల, నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

యోగాంధ్ర విజయవంతం చేయాలి

విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో నియోజకవర్గ ప్రజలు పాల్గొనేలా చూడాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ సూచించారు. ఈ మేరకు నియోజకవర్గం టీడీపీ నాయకులు, డివిజన్‌ ఇన్‌చార్జీలతో యోగాపై సమీక్ష నిర్వహించారు. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. సమీక్షలో కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు వర్ల కుమార్‌రాజా, శ్రీనివాసులుతోపాటు స్థానిక నాయకులు మాదారపు వెంకటేష్‌, సింతు సుధాకర్‌, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:15 PM