Share News

sand: పట్టుకున్నా.. మా పని మాదే

ABN , Publish Date - May 06 , 2025 | 11:22 PM

Sand Mining హిరమండలం పరిధిలోని వంశధార నది నుంచి ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది నాయకులు ఇసుకాసురుల అవతారమెత్తి.. నిత్యం వందల ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు.

sand: పట్టుకున్నా.. మా పని మాదే
భగీరథపురం వద్ద వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు

వంశధార నదిలో ఆగని ఇసుక తవ్వకాలు

హిరమండలం, మే 6(ఆంధ్రజ్యోతి): హిరమండలం పరిధిలోని వంశధార నది నుంచి ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. కొంతమంది నాయకులు ఇసుకాసురుల అవతారమెత్తి.. నిత్యం వందల ట్రాక్టర్లతో వివిధ ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. భగీరథపురం, సుభలయ, అంబావల్లి, పిండ్రువాడ తదితర గ్రామాల సమీపంలోని వంశధార నది గర్భంలో రాత్రీపగలూ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఇటీవల రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అక్రమ ఇసుక క్వారీలపై దాడులు నిర్వహించి 13 ట్రాక్టర్లను పట్టుకున్నారు. నామమాత్రపు అపరాధ రుసుం విధించి ట్రాక్టర్లను విడిచిపెట్టేశారు. కాగా.. రెండు రోజుల తర్వాత యథావిధిగా ఇసుక అక్రమ రవాణా మొదలు పెట్టేశారు. అధికారులు పట్టుకున్నా.. మా పని మాదే అన్న చందంగా ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Updated Date - May 06 , 2025 | 11:22 PM