Share News

ఘనంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌ పుట్టినరోజు

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:49 PM

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జన్మదినాన్ని గురువారం టీడీపీ క్యాడర్‌ ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు.

ఘనంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌ పుట్టినరోజు
అరసవల్లి: రామ్మోహన్‌ బర్త్‌ డే కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

(ఆంధ్రజ్యోతి బృందం)

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు జన్మదినాన్ని గురువారం టీడీపీ క్యాడర్‌ ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. నగరంలోని స్థానిక 80 అడుగుల రోడ్డులో ఉన్న కేంద్రమంత్రి నివాసంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. పలు దేవాలయాల్లో ఆయన పేరున ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం 2వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అంతకు ముందు దివంగత కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్‌తో పాటు కూటమి నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాలు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో రామ్మోహన్‌ నాయుడు బర్త్‌డే కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు.

Updated Date - Dec 18 , 2025 | 11:49 PM