Share News

కెనడా ఐసీఏవో సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:55 PM

కెనడా దేశం మాంట్రియాల్‌లో జరుగుతున్న 42వ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏవో) సాధారణ సభలో గురువారం భారత దేశ ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు.

కెనడా ఐసీఏవో సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్‌
కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుకు జ్ఞాపిక అందిస్తున్న ఐసీఏవో ప్రతినిధులు

శ్రీకాకుళం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): కెనడా దేశం మాంట్రియాల్‌లో జరుగుతున్న 42వ ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీఏవో) సాధారణ సభలో గురువారం భారత దేశ ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐసీఏవో కౌన్సెల్‌ అధ్యక్షుడు సాల్వటోర్‌ షియాక్చిటానో, కార్యదర్శి జనరల్‌ జువాన్‌ కార్లోస్‌ సలాజార్‌ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సభలో పాల్గొనడం అరుదైన గౌరవంగా రామ్మోహన్‌నాయుడు అభిప్రాయపడ్డారు. భారత విమానయానరంగం సాధిస్తున్న వృద్ధిని ప్రస్తా వించారు. ఐసీఏవో ఎల్లప్పుడూ అంది స్తున్న సహాయ సహకారాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్‌ ఏవియేషన్‌లో దేశం చూపబోయే భవిష్యత్‌ విప్లవాన్ని, ఐసీఏవో కౌన్సెల్‌తో పాటు సభ్యదేశాలతో పంచుకోబోయే టెక్నికల్‌ నైపుణ్యం, స్కిల్లింగ్‌ అనుభవం వంటి అంశాలపై కేంద్ర మంత్రి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఐసీఏవో స్వీకరించిన తాజా నినాదం ‘నో కంట్రీ లెఫ్ట్‌ బిహైండ్‌’ అనే అంశం, ప్రధాని నరేం ద్రమోదీ ఆలోచన ‘వసుధైౖక కుటుంబం’ అన్న మాన వతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఇంట ర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌ ఇచ్చిన ఆదేశానికి భారత్‌ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. అదే విధంగా సస్టయినబుల్‌ ఏవియేషన్‌ ఫ్యూయల్‌ వినియోగంపై భారత్‌ తీసుకుంటున్న దృఢమైన చర్యలను.. విమానయాన రంగంలో మరింత మంది మహిళలు పాల్గొనేలా లింగ సమా నత్వంతో కూడిన మార్పులను వివరించారు. ఈ సందర్భంగా భారత విమానయాన రంగంలో సాధించిన వృద్ధికి గాను ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు రామ్మోహన్‌నాయుడికి అభినందన లు తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 11:55 PM