Share News

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Nov 29 , 2025 | 11:59 PM

ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ (శ్రీకాకుళం రోడ్డు) వద్ద ఊసవానిపేట గేటు సిగ్నల్‌ పాయింట్‌ సమీపంలో శని వారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్‌ పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు.

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆమదాలవలస, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ (శ్రీకాకుళం రోడ్డు) వద్ద ఊసవానిపేట గేటు సిగ్నల్‌ పాయింట్‌ సమీపంలో శని వారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్‌ పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు 60 సంవత్సరాలు ఉంటుందని, కుడిచేతిపై పువ్వు గుర్తు గల పచ్చబొట్టు ఉందని, నీలం, తెలుపు, నలుపు రంగుచారలు ఉన్న టీషర్ట్‌తో పాటు తెలుపు, నీలం రంగు ఉన్న గళ్లలుంగీ ధరించి ఉన్నాడని వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించామన్నారు. వివరాలకు 9493474582, 9110305494 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

వేంపాడు వద్ద పలాస వాసి..

నక్కపల్లి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు హైవే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు. నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన షేక్‌ తాజుద్దీన్‌(36) ఇటీవల రాజమహేంద్రవరంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం రాత్రి అక్కడి నుంచి ద్విచక్ర వాహనం పై పలాసకు బయలుదేరాడు. దారిలో వేంపాడు వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. పలాసలో ఉన్న తాజుద్దీన్‌ కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 11:59 PM