Share News

వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:54 PM

నగ రంలో ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో గుర్తుతెలి యని ఓ వ్యక్తి మృతి చెం దినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైం: చికిత్స పొందుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి

శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): నగ రంలో ఆదివారం జరిగిన రో డ్డు ప్రమాదంలో గుర్తుతెలి యని ఓ వ్యక్తి మృతి చెం దినట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. రామలక్ష్మణ కూడలి నుంచి సూర్యమహల్‌ జంక్షన్‌ రోడ్డు పై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి కాలూరి వెంకట నరసింగరావు బొలెరో వాహనం నడుపుతూ వచ్చి ఆ వ్యక్తిని ఢీకొని ఆపకుండా వెళ్లిపోయాడు. తీ వ్రగాయాలైన ఆ వ్యక్తిని స్థానికులు 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. విష యం తెలుసుకన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుధాకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరా ఆధారంగా ఢీకొన్న వాహనాన్ని గుర్తించి డ్రైవింగ్‌ చేస్తు న్న నరసింగరావును పట్టుకుని కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తికి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించేందుకు సిద్ధమవు తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి నీలం రంగు గళ్ల లుంగీ, షర్ట్‌ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసినవారు ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

నరసన్నపేట, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): స్థానిక జమ్ము జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బమ్మిడి దామోదరరావు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందినట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరా ల మేరకు.. ఈ నెల 27న స్థానిక ఒక హోటల్‌లో పనిచేస్తున్న దామోదరరావు డ్యూటీ ముగించుకుని స్వగ్రామం పోలాకి మండలం గాతలవలస వెళ్తుండగా.. టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో త్రీవంగా గాయపడ్డ దామోదరావును శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. భార్య వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ట ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Sep 28 , 2025 | 11:54 PM