రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:00 AM
హరిశ్చంద్రపురం రైలు నిలయం సమీపాన గల ఫ్లైఓవర్ కింద శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం రైలు నిలయం సమీపాన గల ఫ్లైఓవర్ కింద శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పలాస జీఆర్పీ పోలీసు సోమేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడి వయస్సు 50నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎడమకాలి పాదానికి బ్యాండేజ్ కట్టు ఉందని, మెడలో తాయత్తు, తెలుపు, నీలం కలర్ గడులుో ఉన్న తువ్వాలు, నలుపు, తెలుపు గీతలు కలిగిన లుంగి, తెలుపు రంగు బాడి ధరించి ఉన్నాడన్నారు. ఇతడి వివరాలు తెలిసినవారు 94922 50069 ఫోన్ నెంబరులో సంప్రదించాలని కోరారు.
తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో ఒకరు..
జలుమూరు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే హెచ్‌సీ ఎస్.మధుసూధనరావు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. పలాస నుంచి ఆమదాలవలస వెళ్లే రైలు ఢీకొన్నట్టు ఆయన తెలిపారు. మృతుడి వయసు 60 ఏళ్లు ఉండొచ్చన్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో భద్రపరచినట్టు ఆయన తెలిపారు. వివరా లు తెలిసినవారు రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.