రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:39 PM
పూండి రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు.
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): పూండి రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. మృతుడి వయస్సు 30 ఏళ్లు ఉండొచ్చని, పింక్ కలర్ టీషర్టు, సిమెంట్ కలర్ షాట్ ధరిం చారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమర్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసివారు 94406 27567 ఫోన్ నెంబరులో సంప్రదించాలని జీఆర్‌పీ ఎస్‌ఐ కోరారు.