రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడి మృతి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:14 AM
పలాస రైల్వేస్టేషన్ పరిధి సోంపేట-జాడపూడి ఆర్‌ఎస్ డౌన్ వద్ద బుధవారం రైలు ఢీకొని గుర్తుతెలియ ని వృద్ధుడు మృతి చెందాడు.
కంచిలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్ పరిధి సోంపేట-జాడపూడి ఆర్‌ఎస్ డౌన్ వద్ద బుధవారం రైలు ఢీకొని గుర్తుతెలియ ని వృద్ధుడు మృతి చెందాడు. మృతుడి వయసు సుమారుగా 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుం దని, తెలుపు, నలుపు షర్ట్, పింక్, గులాబీ రం గుల లుంగీ ధరించి ఉన్నాడని రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.
ఒడిశాలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
కవిటి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కవిటి పంచాయతీ గొం డ్యాలపుట్టుగ గ్రామానికి చెందిన బైరెడ్ల రమేష్(37) మంగళవారం రాత్రి మృతి చెందాడు. రమేష్ కంచిలి మండలం జలంత్రకోట వద్ద ఉన్న క్రషర్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగా లేక రెండు రోజులుగా ఇంటి వద్దే ఉన్నాడు. ఆరోగ్యం కుదుటపడ డంతో రాయగడకు ఎక్స్‌కవేటర్‌ని తీసుకుని వెళ్లాడు. రాత్రి ఘాటి రోడ్డులో వెళుతున్న సమయంలో ఆకస్మాత్తుగా జరిగిన రోడ్డుప్రమా దంలో గాయపడ్డాడు. వెంటనే పర్లాకిమిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ మృతి చెందినట్టు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. రమేష్‌కి భార్య మోహినితో పాటు ఐదేళ్లలోపు పిల్లలు ముగ్గురు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందాడని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చెరువులో మహిళ మృతదేహం లభ్యం
సరుబుజ్జిలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పురుషోత్తపురం గ్రామానికి చెందిన అంపోలు శకుంతల(40) గ్రామ సమీపంలోని చెరువులో బుధవారం శవమై తే లింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శకుంతల కన్నవారి గ్రామం నరస న్నపేట మండలం చోడవరం. చెరువులో మృతదేహం ఉన్నట్టు వచ్చిన సమాచా రం మేరకు ఎస్‌ఐ బెండి హైమావతి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకు ని పరిశీలించారు. శకుంతలకు భర్త, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. శకుంతల తండ్రి కంచరాపు రమణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. శకుంతల కొంతకాలంగా మానసికంగా బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు.
అస్వస్థతకు గురై గ్రానైట్ కార్మికుడి మృతి
టెక్కలి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రావివలస సమీపంలో ఓ గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్న గేదెల ఎర్రయ్య(48) బుధవారం క్వారీలోనే అస్వస్థతకు గురయ్యాడు. ఈ మేరకు క్వారీ యంత్రాంగం ఎర్రయ్యను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. యర్రయ్యది ఇదే మండలం పరశురాంపురం గ్రామం. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.