సిబ్బంది లేక అందని సేవలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:42 PM
: మండలంలోని బైదలాపురం పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో సేవలందని పరిస్థితి నెలకొంది. ఈ పీహెచ్‌సీ పరిధిలో తొమ్మిది సబ్‌సెంటర్లల్లో 60 గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలందియాల్సి ఉంది.
పాతపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బైదలాపురం పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో పూర్తిస్థాయిలో సేవలందని పరిస్థితి నెలకొంది. ఈ పీహెచ్‌సీ పరిధిలో తొమ్మిది సబ్‌సెంటర్లల్లో 60 గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలందియాల్సి ఉంది. ఇక్కడకు అత్యధికంగా గిరిజనుల గ్రామాల నుంచి రోగులు వస్తుంటారు. సుదూరం ప్రాంతంలోని గిరిజనులకు 24గంటలూ వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈ పీహెచ్‌సీకి వైద్యులు, సిబ్బంది కొరత వల్ల లక్ష్యం అటకెక్కుతోంది. దశాబ్ద కాలంగా సిబ్బంది, వైద్యుల కొరత వేధిస్తున్నా ప్రజాప్రతినిధులు, వైద్యాశాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నరని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు అవసరం కాగా ఒకరితోనే నెట్టుకొస్తున్నారు.ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉండాల్సిఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఉన్న ఆ ఒక్కస్టాఫ్‌నర్సు కూడా ఏడాదిన్నరపాటు శిక్షణపొందేందుకు వెళ్లిపోడంతో పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సులు లేకుండా వైద్యసేవలు అందించాల్సిన దుస్థితినెలకొంది.
ల్యాబ్ టెక్నీషియన్ లేక..
రోగులకు రోగనిర్ధారణ చేసేందుకు కీలకపాత్ర పోషించే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఒకటి కేటాయించారు. ప్రస్తుతం ఆ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. దీంతో బయట ల్యాబ్‌ల్లో రోగనిర్ధారణ పరీక్షలు చేయాల్సివస్తోందని రోగులు వాపోతు న్నారు. గిరిజనులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని, వైద్యరం గానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతున్న కూటమి పాలకులు సిబ్బంది, వైద్యుల నియామకంలో చోద్యంచూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గిరిజనులకు వైద్యసేవలందించేం దుకు తక్షణమే పూర్తిస్థాయిలో సిబ్బందిని భర్తీచేయాలని గిరిజన సంఘాల నాయ కులు కోరుతున్నారు. కాగా బైదలాపురం పీహెచ్‌సీలో ఉన్న ఖాళీల భర్తీకి సంబం ధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని వైద్యాధికారి సత్యవాణి తెలిపారు. త్వరలో భర్తీచేస్తామని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు.