Water problem పలాస-కాశీబుగ్గకు ఉద్దానం నీటిని అందించాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:34 AM
Water problem పలాస -కాశీబుగ్గ పురపాలక సంఘ ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని, ఉద్దానం రక్షిత నీటి పథకం ద్వారా వేసవిలోగా తాగు నీరందించాలని ముని సిపల్ కమిషనర్ ఎన్.రామారావు కోరారు.

పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ, ఈఈలతో కమిషనర్ సమీక్ష
పలాస, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పలాస -కాశీబుగ్గ పురపాలక సంఘ ప్రజలు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని, ఉద్దానం రక్షిత నీటి పథకం ద్వారా వేసవిలోగా తాగు నీరందించాలని ముని సిపల్ కమిషనర్ ఎన్.రామారావు కోరారు. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రాయల్ బాబు, ఈఈ సుగుణాకర్‌తో తన చాంబర్‌లో ఆయన సమీక్షించారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ లో మునిసిపాలిటీలో తాగునీటి ఎద్దడిపై ప్రత్యేక కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు మునిసిపల్ అధికారులతో చర్చించేందుకు వారు కార్యాలయానికి వచ్చి కమిషనర్‌తో చర్చించారు. పట్టణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ఎంపీ ల్యాడ్ నిధుల్లో ఎక్కువ మొత్తం మంచినీటి పథకాలకే కేటాయించామని కమిషనర్ వారికి వివరించారు. డీఈఈ కనకరాజు, ఏఈ కిరణ్‌కుమార్ ఉన్నారు.