Share News

లారీ కిందకు దూసుకుపోయిన ద్విచక్ర వాహనం

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:59 PM

పలాస బైపాస్‌ రోడ్డు శాసనం గ్రామం వద్ద ఆదివారం లారీ కిందకు ఓ ద్విచ క్రవాహనం దూసుకుపోయి న ఘటన చో టుచేసుకుంది.

లారీ కిందకు దూసుకుపోయిన ద్విచక్ర వాహనం
లారీకింద ఇరుకున్న బైక్‌

  • ఇద్దరికి తీవ్రగాయాలు

పలాస, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): పలాస బైపాస్‌ రోడ్డు శాసనం గ్రామం వద్ద ఆదివారం లారీ కిందకు ఓ ద్విచ క్రవాహనం దూసుకుపోయి న ఘటన చో టుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒ డిశాకు చెందిన ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అంతరసింగి గ్రామానికి చెందిన ఈశ్వరరావు, సుని ల్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపుతప్పి లారీ కిందకు దూసుకు పోయింది. ఈ ఘటనలో ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో గాయాలతో బయట పడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించ గా.. మెరుగైన చికిత్స కోసం టెక్కలి ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నర్సింహమూర్తి తెలిపారు.

లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కంచిలి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): బూరగాం జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ పూర్ణమషి ధాకర్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెస్ట్‌ బెంగాల్‌ రాష్ట్రం పరగనాస్‌ జిల్లాకు చెందిన పూర్ణమషి ధాకర్‌(52) రెడీమేడ్‌ దుస్తుల లోడ్‌తో ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళుతూ బూరగాం జంక్షన్‌ వద్ద లారీని ఆపి బహిర్భూమి కోసం రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన మరో లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనం లో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో బరంపురం ఎంకేసీజీ హాస్పటల్‌కు తరలించినట్లు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.

Updated Date - Dec 07 , 2025 | 11:59 PM