Share News

ద్విచక్ర వాహనాలు ఢీ: యువకుడి మృతి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:04 AM

ద్వారకాపురం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లాబర గ్రామానికి చెందిన కణపల మధు (24) అక్కడి కక్కడే మృతి చెందాడు.

ద్విచక్ర వాహనాలు ఢీ: యువకుడి మృతి

పాతపట్నం, మార్చి 12(ఆంధ్ర జ్యోతి): ద్వారకాపురం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లాబర గ్రామానికి చెందిన కణపల మధు (24) అక్కడి కక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లాబర గ్రామానికి చెందిన కణపల మధు, బావమరిది మండల శివ తెంబూరు నుంచి లాబర ద్విచక్ర వాహనంపై వస్తుండ గా సారవకోట మండలం జమ్ముచక్రం గ్రామా నికి చెందిన వేణుగోపాల్‌ ద్విచక్రవాహనంపై గంగువాడ నుంచి తెంబూరు వెళుతుండగా ద్వారకాపురం కూడలి వద్ద రెండు బైక్‌లు ఢీకొని ఈ ఘటన జరి గింది. ఈ ప్రమాదంలో కణపల మధు అక్కడి కక్కడే మృతిచెందాడు. మధుకు వచ్చే నెల 16వ తేదీన వివాహం జర గాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్తపల్లి సమీపంలోని కరడా సంగి గ్రామంలో ఉన్న తన చెల్లెలి వద్దకు వెళ్లి చెల్లెలి భర్త మండల శివతో కలిసి లాబర వస్తుండగా జరిగినప్రమాదంలో మధు మృతి చెందడంతో ఆయన కుటుం బంలో విషాదం నెలకొంది. మండల శివకు తీవ్ర గాయాలు కాగా స్థానిక సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. తండ్రి కణపల కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు విజయవాడలో ఓ ఐరన్‌ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సాయమ్మ, కృష్ణ కన్నీరుమున్నీరవుతున్నారు.
మహిళ ఆత్మహత్య
నందిగాం, మార్చి 12(ఆంధ్రజ్యోతి):
సుభద్రా పురం గ్రామానికి చెందిన టొంప తులసమ్మ (54) బుధవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తులసమ్మ భర్త దండాసి సుమారు 20 ఏళ్ల కిందట మృతి చెందగా కుమార్తె పార్వతికి వివాహం చేసింది. అయితే ఆమెను భర్త వదిలే యడంతో పార్వతి తన కుమారుడు కుజ్జ జానకి రావుతో కలిసి తల్లి వద్దనే ఉంటోంది. తులసమ్మకు కొద్దిగా మతిస్థిమితం లేకపోవడంతో బుధవారం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందును సేవించడంతో అపస్మారక స్థితికి చేరింది. గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీ సులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మనవడు జానకిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ఎచ్చెర్ల, మార్చి 12(ఆంధ్రజ్యోతి):
జరజాం జంక్షన్‌ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. శ్రీకాకుళం రూరల్‌ మండలానికి చెందిన చోడిపల్లి త్రినాఽథరావు, ఆయన భార్య నిహారిక ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం నుంచి నెల్లిమర్ల వెళ్తున్నారు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో త్రినాఽథరావు, నిహారికతో పాటు వెనుక నుంచి ద్విచక్రవాహనంతో ఢీకొన్న వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 13 , 2025 | 12:04 AM